రౌడీషీటర్ల ఇండ్లలో ఆకస్మిక తనిఖీలు

రౌడీషీటర్ల ఇండ్లలో ఆకస్మిక తనిఖీలు
  • 90 మందికి పైగా నివాసాల్లో ఏకకాలంలో సోదాలు

ఓల్డ్​సిటీ, వెలుగు: పాతబస్తీలో చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖారే ప్రభాకర్ పర్యవేక్షణలో పోలీసులు శనివారం భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అసాంఘిక శక్తులను అరికట్టేందుకు సుమారు 300 మంది పోలీసు సిబ్బందితో జోన్ వ్యాప్తంగా 90 మందికి పైగా రౌడీ షీటర్ల నివాసాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.

ఈ ఆపరేషన్​లో ఒమర్ ఖాన్, ఆరిఫ్ ఖాన్ సహా పలువురు రౌడీ షీటర్ల ఇండ్లలో మారణాయుధాలు, గంజాయి కోసం శోధించగా ఎటువంటి అక్రమ వస్తువులు లభించలేదని డీసీపీ తెలిపారు. రౌడీయిజంపై ‘జీరో టాలరెన్స్’ పాటిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు కఠిన కారాగార శిక్ష తప్పదని హెచ్చరించారు.