
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. స్టార్క్, హేజల్ వుడ్, కమ్మిన్స్ ఉన్న జట్టులో రిజర్వ్ ప్లేయర్ గా దాదాపు ప్రతి మ్యాచ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. అయితే టెస్ట్ క్రికెట్ చరిత్రలో బోలాండ్ అత్యంత నిలకడైన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. చివరి 110 ఏళ్ళ టెస్ట్ క్రికెట్ లో తానే బెస్ట్ బౌలర్ అని బోలాండ్ నిరూపించుకున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఈ ఆసీస్ పేసర్ మూడు వికెట్లు పడగొట్టాడు. కనీసం 2000 బంతులు వేసి 1915 నుండి టెస్ట్ క్రికెటర్లకు అత్యుత్తమ బౌలింగ్ సగటు తీస్తే బోలాండ్ అగ్ర స్థానంలో ఉండడం విశేషం.
బోలాండ్ టెస్ట్ బౌలింగ్ యావరేజ్ 17.33 మాత్రమే కావడం ఆశ్చర్యకరం. 1915 తర్వాత కనీసం 2000 బంతులు వేసిన బౌలర్ కు ఇదే బెస్ట్ బౌలింగ్ యావరేజ్. ప్రస్తుత గణాంకాల ప్రకారం బోలాండ్ 1915 నుండి టెస్ట్ యావరేజ్ బౌలర్లలో అగ్రస్థానంలో ఉన్నాడు. టెస్ట్ కెరీర్ లో ఈ ఆసీస్ పేసర్ 17.33 సగటుతో 59 వికెట్లు తీసుకున్నాడు. అతని తర్వాత బెర్ట్ ఐరన్‌మోంగర్ (1928-1933) 17.97 సగటుతో 74 వికెట్లు, ఫ్రాంక్ టైసన్ (1954-1959) 18.56 సగటుతో 76 వికెట్లు, అజాజ్ పటేల్ (2021-ప్రస్తుతం) 19.34 సగటుతో 55 వికెట్లు, జస్‌ప్రీత్ బుమ్రా (2018-ప్రస్తుతం) 19.48 సగటుతో 217 వికెట్లతో వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.
ఆసీస్ టెస్ట్ జట్టులో అవకాశం వచ్చినప్పుడల్లా బోలాండ్ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నాడు. ఇటీవలే జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జోష్ హేజిల్‌వుడ్ గాయంతో.. అతని స్థానంలో ఆస్ట్రేలియా స్కాట్ బోలాండ్ ను ఆడించింది. ఐదు టెస్టుల్లో మూడు టెస్ట్ మ్యాచ్ ల్లో అతనికి ఆడే అవకాశం లభించగా.. మూడు టెస్టుల్లో ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆడిన మూడు టెస్టుల్లో 6 ఇన్నింగ్స్ ల్లో ఏకంగా 21 వికెట్లు పడగొట్టాడు. అతని సగటు కేవలం 13.19 సగటు కాగా.. స్ట్రైక్ రేట్ 29.04. సిరీస్ లో చివరిదైన సిడ్నీ టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో 10 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఓవరాల్ గా ఈ సిరీస్ లో బుమ్రా (32), కమ్మిన్స్ (26) తర్వాత అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా నిలిచాడు.
Scott Boland’s impact continues to grow 👏#WTC27 | #WIvAUS➡️ https://t.co/PDhJ4EKhbX pic.twitter.com/pjhvLCFVWu
— ICC (@ICC) July 14, 2025