
కుత్బుల్లాపూర్: సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బేకరీలో మేడ్చల్ ఎస్ఓటి పోలీసుల ఆకస్మిక తనిఖీలు చేశారు. సూరారం ఓం జెండా దగ్గర ఉన్న డ్రీమ్ ఫప్ బేకరీలో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తిను బండారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెనిలా పౌడర్, మిల్క్ ప్లేవర్, సింథటిక్ కలర్,40 కిలోల కేకులు, బ్రెడ్లతో పాటు పలు ఆహార వస్తువులను సీజ్ చేశారు. బేకరీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
ఒక్క బేకరీల్లోనే కాదు.. సిటీలోని షాపుల్లో కూడా ఔట్ డేటెడ్ మాల్ అమ్ముతున్నారు. పాలు, పెరుగు, బ్రెడ్‌తో పాటు పిల్లలు తినే స్నాక్స్ ప్యాకెట్ల వరకు అన్ని అలాగే లభిస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) స్టాంపు లేకుండానే వస్తువులు మార్కెట్లోకి అమ్మకానికి వస్తున్నాయి. వంటలోకి వాడే పొడులు, మసాలాలపై అసలు ఎలాంటి ముద్ర ఉండటం లేదు. ఇలా ఎప్పుడు తయారైందనే విషయం కూడా తెలియడం లేదు.
ఔట్ ఆఫ్ డేట్‌పై ప్రజల్లో కూడా అవేర్ నెస్ లేకపోవడంతో ఆ విషయాన్ని పట్టించుకోకుండానే ఏది పడితే అది తింటూ అనారోగాల పాలవుతున్నారు. పరిస్థితి మితిమీరుతుండటంతో కొందరైతే ఏకంగా హాస్పి టల్స్లో చేరుతున్నారు. చిన్న పిల్లలు తినే స్నాక్స్ ప్యాకెట్లు అయితే నకిలీ పేర్లతో పిల్లలను ఆకట్టుకు నేలా అనేక రకాల్లో కిరాణ షాపుల్లో విచ్చలవిడిగా లభిస్తున్నాయి. బ్రాండెడ్ తరహాలోనే ఈ ప్యాకెట్లు ఉంటున్నాయి. కానీ వీటిపై ఎటువంటి ముద్రలు ఉండటంలేదు. బ్రాండెడ్ ప్యాకెట్లతో పోలిస్తే వీటిపై ఎక్కువ బెనిఫిట్ ఉండటంతో షాపుల యజమానులు కూడా వీటినే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. దీంతో చిన్నారులు క్వాలిటీ లేని ఫుడ్ను తీసుకొని రోగాల బారినపడుతున్నారు.
Also Read:-జిలేబీ, సమోసా, ఛాయ్ బిస్కెట్లపై.. కేంద్రం కీలక నిర్ణయం.. పెద్ద విషయమే ఇది !
చాలా హోటళ్లు, రెస్టారెంట్లో నిల్వచేసిన ఆహారాన్నే మళ్లీ వండి వడ్డిస్తున్నారు. ఫ్రిజుల్లో రోజుల తరబడి నిల్వ చేసిన చికెన్, మటన్కు రసాయనాలతో కూడిన రంగులు పూసిన ఫుడ్ను కస్టమర్లకు వడ్డిస్తున్నారు. అన్‌సేఫ్, మిస్‌బ్రాండింగ్, నాసిరకం కేటగిరీల్లో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఇలాంటి విస్తుపోయే నిజాలే బయటపడ్డాయి. ఫ్రిజ్ల్లో నిల్వ చేయడంతో కంపు కొడుతున్న మాంసాన్ని కూడా ఫ్రెష్గా ఉంచేందుకు రసాయనాలను చల్లుతున్నట్టు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. కొన్ని చోట్ల కుళ్లిన మాంసంతో బిర్యానీ, గడువు తీరిన మసాలాలు, ఇతర సరుకులను వంటలకు వాడుతున్నట్టు కూడా తేలింది.