Priyadarshi : ప్రియదర్శి హీరోగా 'ప్రేమంటే' ఫస్ట్ లుక్ విడుదల.. నాగచైతన్య శుభాకాంక్షలు!

Priyadarshi : ప్రియదర్శి హీరోగా 'ప్రేమంటే' ఫస్ట్ లుక్ విడుదల..  నాగచైతన్య శుభాకాంక్షలు!

టాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తుంపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి పులికొండ ( Priyadarshi Pulikonda).  ఆయన ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా  'ప్రేమంటే' ( Premante  ) చిత్రంతో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీలో ప్రియదర్శి సరసన ఆనంది ( Anandhi ) , హీరోయిన్ గా నటిస్తోంది.   ఈ చిత్రానికి 'థ్రిల్ ప్రాప్తిరస్తు' అనే ఆసక్తికరమైన ఉపశీర్షిక ఉండటం సినిమా కథాంశంపై మరింత ఉత్సుకతను రేకెత్తిస్తోంది.

ఈ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్‌ పోస్టర్‌ను ప్రముఖ హీరో నాగచైతన్య (Naga Chaitanya) తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మోషన్ పోస్టర్ సినిమాలోని థ్రిల్, రొమాన్స్ అంశాలను సూచిస్తూ, ప్రేక్షకులలో అంచనాలను పెంచింది. నాగచైతన్య వంటి స్టార్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల కావడం సినిమాకు మంచి ప్రచారాన్ని అందించింది. అటు అభిమానులు సైతం ఈ మూవీపై బాగానే అంచనాలు పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో ప్రియదర్శికి కంగ్రాట్స్ చెబుతున్నారు.  అటు ప్రియదర్శి కూడా నాగచైతన్యకు కృతజ్ఞతలు తెలిపారు.  'ప్రేమంటే' మొదటి షో తర్వాత మీ సమీక్ష కోసం వేచి చూస్తుంటా అని పోస్ట్ చేశారు.

 

నవనీత్‌ శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రాన్ని లవ్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాల మేళవింపుతో రూపొందిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రియదర్శి కామెడీ టైమింగ్, సహజమైన నటనకు ప్రసిద్ధి. ఆనంది కూడా భావోద్వేగ పాత్రలలో రాణించగల నటి. వీరిద్దరి కాంబినేషన్ లవ్, కామెడీ సన్నివేశాలలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మూవీ టీమ్ ధీమా వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా, 'థ్రిల్ ప్రాప్తిరస్తు' అనే ఉపశీర్షికతో కూడిన థ్రిల్లింగ్ అంశాలు సినిమాకు కొత్త మలుపులు, ఉత్కంఠను అందిస్తాయని భావిస్తున్నారు.

'ప్రేమంటే' చిత్రం ప్రియదర్శి కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయి కానుంది. కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో అలరించిన ప్రియదర్శి, ఈ సినిమాతో హీరోగా తన సత్తాను చాటుకోవడానికి సిద్ధమవుతున్నారు. విభిన్నమైన కథాంశాలు, కొత్త దర్శకులను ప్రోత్సహించే టాలీవుడ్‌లో, 'ప్రేమంటే' ఒక మంచి సక్సెస్ అవుతుందని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ చిత్రం ద్వారా ప్రియదర్శికి హీరోగా మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఈ సినిమా విడుదల తేదీ, మిగిలిన నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. 'ప్రేమంటే' ఎలా ఉండబోతుందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.