అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ ఎఫెక్ట్.. జులై 21 లోపు చెక్ చేసుకోండి.. అన్ని ఎయిర్ లైన్స్కు DGCA డెడ్ లైన్

అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ ఎఫెక్ట్.. జులై 21 లోపు చెక్ చేసుకోండి.. అన్ని ఎయిర్ లైన్స్కు DGCA డెడ్ లైన్

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదాన్ని సీరియస్ గా తీసుకుంది పౌర విమానయాన శాఖ. భవిష్యత్తులో అలాంటి ఘోర ప్రమాదం జరగకుండా చూసేందుకు స్ట్రిక్ట్ రూల్స్ ను తీసుకురానుంది. అందులో భాగంగా ఎయిర్ లైన్స్ సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) డెడ్ లైన్ విధించింది. ఫుయెల్ కంట్రోల్ స్విచెస్ లాకింగ్ మెకానిజంపై పూర్తి ఇన్స్పెక్షన్ చేసుకోవాలని సూచించింది. అందుకు జులై 21 చివరితేదీగా డెడ్ లైన్ విధించింది. 

ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ క్రాఫ్ట్ సేఫ్టీపై  ఆందోళనలు నెలకొన్న పరిస్థితుల్లో ఈ ఆదేశాలు జారీ చేసింది విమానయాన శాఖ. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత బోయింగ్ 787 సీరీస్ విమానాల భద్రతపై ఆందోళనలు ఎక్కువయ్యాయి. దీంతో తనిఖీలు జులై 21 లోపు పూర్తిచేయాలని ఆదేశించింది. B787 డ్రీమ్ లైనర్, B737s లలోని స్విచెస్ ను చెక్ చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మోడల్ విమానాలను ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలు నడుపుతున్నాయి. 

జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంపై ప్రాథమిక విచారణలో తేలిని అంశాల ఆధారంగా భవిష్యత్తులో అలాంటి టెక్నికల్ సమస్యలు రాకుండా చూసుకునేందుకు చర్యలు మొదలుపెట్టింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఫుయెల్ సప్లై చేసే స్విచ్ ఆఫ్ అయ్యి.. ఆ తర్వాత ఫుయెల్ బ్యాక్ తీసుకొచ్చి.. మళ్లీ ఫుయెల్ రన్ అయ్యేలా చేసిందని.. దీంతోనే ఫుయెల్ సప్లైలో అవాంతరాల కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రైమరీ రిపోర్ట్ లో తేలింది. దీంతో డ్రీమ్ లైనర్స్ లో కంట్రోల్ స్విచెస్ చెక్ చేయాల్సిందిగా ఆదేశించింది. ఎతిహాద్ వంటి విదేశీ ఎయిర్ లైన్స్ ఇప్పటికే తనిఖీలు మొదలు పెట్టాయి. 

అహ్మదాబాద్​లో జూన్ 12న జరిగిన ఎయిరిండియా బోయింగ్ డ్రీమ్​లైనర్ విమాన ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. జూన్ 12న మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా ఏఐ171 బోయింగ్ డ్రీమ్​లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ పోర్టు సమీపంలోని మెడికల్ కాలేజీ భవనాలపై కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలోని 242 మందిలో ఒక ప్యాసింజర్ మినహా మిగతా వారంతా మృతిచెందారు. మెడికల్ కాలేజీలో ఉన్న డాక్టర్లు, ఇతర స్టాఫ్ మరో 19 మంది కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 

 టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే విమానంలోని రెండు ఇంజన్ల ప్యూయెల్ కంట్రోల్ స్విచ్​లు రన్ పొజిషన్ నుంచి కటాఫ్ పొజిషన్​కు వెళ్లాయి. దీంతో రెండు ఇంజన్లకూ వెంటనే ఫ్యూయెల్ సప్లై ఆగిపోయింది. రెండు ఇంజన్లు ఫెయిల్ అయినప్పుడు ర్యామ్ ఎయిర్ టర్బైన్ (ర్యాట్) ఆన్ అవుతుంది. సీసీటీవీ ఫుటేజీలోనూ ర్యాట్ (విమానం కింద ఉండే చిన్న ప్రొఫెల్లర్) ఆన్ కావడం కనిపించింది. అయినా విమానం పైకి ఎగరలేక కొన్ని సెకన్లలోనే కూలిపోయింది” అని ఏఏఐబీ నివేదికలో వివరించింది. కాగా, ప్రస్తుతానికి బోయింగ్ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా ఏఏఐబీ సిఫారసు చేయలేదు. 

ఫ్యూయెల్ స్విచ్​లు ఎందుకు ఆఫ్ అయ్యాయి? 

విమానంలో ఫ్యూయెల్ కంట్రోల్ స్విచ్​లు అంత ఈజీగా ఆన్, ఆఫ్ కావని ఎక్స్​పర్ట్​లు చెప్తున్నారు. విమానం కాక్ పిట్​లో ఇద్దరు పైలెట్ల మధ్య ఉండే ప్యానెల్​పై రెండు ఇంజన్లకు రెండు ప్యూయెల్ స్విచ్​లు కొన్ని ఇంచుల దూరంలో ఉంటాయి. వీటి పొజిషన్ మార్చాలంటే గట్టిగా పైకి లాగి, ఆ తర్వాత కిందికి (కటాఫ్) లేదా పైకి (రన్) పొజిషన్ మార్చాల్సి ఉంటుంది. అందుకే ఆటోమేటిక్​గా లేదంటే పొరపాటున చేయి తాకినా లేదంటే సాఫ్ట్ వేర్ వైఫల్యం, పవర్ సప్లై ఆగిపోవడం వంటివి జరిగినా ప్యూయెల్ స్విచ్ లు కదిలే అవకాశమే  లేదని అంటున్నారు. పైలెట్లలో ఎవరో ఒకరు మ్యానువల్​గా స్విచ్ ఆఫ్ చేయడానికి మాత్రమే చాన్స్ ఉందని చెప్తున్నారు. ఈ క్రమంలో ఫుయెల్ కంట్రోల్ స్విచెస్ కంపల్సరీ గా చెక్ చేసుకోవాలని డీజీసీఏ సూచించింది.