అసోంలో భారీ భూకంపం.. పశ్చిమబెంగాల్, భూటాన్లలో భూప్రకంపనలు..పరుగులు పెట్టిన జనం

అసోంలో భారీ భూకంపం.. పశ్చిమబెంగాల్, భూటాన్లలో భూప్రకంపనలు..పరుగులు పెట్టిన జనం

అసోంలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం (సెప్టెంబర్​14) అసోంలోని సోనిత్​ పూర్​ జిల్లాలోని ధేకియాజులి కేంద్రం దగ్గర ఉదల్గురికి 14 కి.మీ తూర్పున రిక్టర్ స్కేల్ పై 5.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగా, భూటాన్, అరుణాచల్​​ ప్రదేశ్​ లలో భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయంతో  పరుగులు పెట్టారు. 

అస్సాంలోని ఉదల్గురి, కోచ్​ బీహార్​ నుంచి 283 కి.మీ తూర్పున పశ్చిమ బెంగాల్​ లోని కూచ్​ బెహర్​మధ్య ఆదివారం సాయంత్రం 4.41 గంటలకు భూకంపం సంభించింది. 

ఆదివారం సాయంత్రం ఈశాన్య భారతదేశంలో భారీ భూకంపం కుదిపేసింది. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న  అసోంలో అనేక జిల్లాలను భూకంపం వణికించింది. భూమి కంపించడంతో ఇళ్లు ఊగిపోయాయి. భయంతో ప్రజలు పరుగులు తీశారు. ఇండ్ల గోడలకు పగుళ్లు ఏర్పడి పెచ్చులూడాయి. 

యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్(EMSC) ప్రకారం..అస్సాంలోని ఉదల్గురికి వాయువ్య దిశలో 18 కి.మీ దూరంలో 11:11 UTC వద్ద 42 కి.మీ లోతులో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదల్గురి, దరంగ్, సోనిత్పూర్ ,పొరుగు జిల్లాలతో పాటు భూటాన్,అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో బలమైన ప్రకంపనలు సంభవించాయి.