రిమోట్ కోసం తల్లిని చంపిన కొడుకు..జీవితఖైదు విధించిన కోర్టు

రిమోట్ కోసం తల్లిని చంపిన కొడుకు..జీవితఖైదు విధించిన కోర్టు

తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచిపెద్ద చేసేందుకు, వారిని మంచి స్థాయికి తీసుకొచ్చేందుకు ఎంతో కష్టపడతారు. కన్నబిడ్డలు కష్టపడకూడదని నిరంతరం శ్రమిస్తారు..అయితే పెరిగి పెద్దయిన పిల్లలు వారి తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించే తీరు నేటి సమాజంలో దారుణంగా ఉంటోంది. ఆస్తులు ఇవ్వలేదని కొందరు, మద్యానికి బానిసై ఇంకొందరు.. ఇలా తల్లిదండ్రులకు నరకం చూపిస్తుంటారు.కొందరైతే ప్రాణాలు తీస్తున్నారు. ఈ కోవకు చెందినవాడే ఈ వ్యక్తి.. కేవలం టీవీ రిమోట్​ కోసం తల్లిని దారుణంగా హతమార్చిన ఘటన యూకెలో జరిగింది. తల్లిని చంపిన భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తికి లండన్​కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాల్లోకి వెళితే.. 

UKలోని బర్మింగ్‌హామ్‌లో తన తల్లిని హత్య చేసినందుకు 39 ఏళ్ల భారత సంతతి వ్యక్తికి జీవిత ఖైదు విధించిన బర్మింగ్​ హాల్​ క్రౌన్​ కోర్టు. గత సెప్టెంబర్‌లో 76 ఏళ్ల తన తల్లి మోహిందర్ కౌర్‌ను హత్య చేశాడు ఆమె కొడుకు సుర్జిత్ సింగ్. నిందితుడు నేరాన్ని ఒప్పుకోవడంతో శుక్రవారం(సెప్టెంబర్12) బర్మింగ్‌హామ్ క్రౌన్ కోర్టులో శిక్షపడింది.

కోర్టు విచారణ ప్రకారం..టెలివిజన్ రిమోట్ కంట్రోల్ విషయంలో జరిగిన వాగ్వాదం తర్వాత తన తల్లిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. దాడి సమయంలో సింగ్​ మద్యం మత్తులో ఉన్నాడని, దర్యాప్తులో భాగంగా జరిపిన పరీక్షల్లో అతని రక్తంలో ఆల్కహాల్ ,కొకైన్ గుర్తించారు. 

అయితే వితంతువు అయిన తన తల్లికి తానే సంరక్షకుడిగా ఉన్నానని, దాడి సమయంలో మద్యం మత్తులో ఉన్నానని కావాలని చేయలేదని కోర్టులో వాదించాడు నిందితుడు. తన తల్లిని దారుణంగా హింసించి గాయపర్చాడని.. తీవ్రగాయాలతో ఆమె చనిపోయిందని తేల్చిన కోర్టు సింగ్​కు జీవిత ఖైదు విధించింది. 

మరిన్ని వార్తలు