బెట్టింగ్ యాప్ కేసు: ఊర్వశీ రౌతేలా, మిమి చక్రవర్తికి ఈడీ నోటీసులు

బెట్టింగ్ యాప్ కేసు: ఊర్వశీ రౌతేలా, మిమి చక్రవర్తికి ఈడీ నోటీసులు

 దేశ వ్యాప్తంగా  బెట్టింగ్ యాప్  ప్రమోషన్ కేసులపై ఈడీ దూకుడు పెంచింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు,రాజకీయ ప్రముఖులను విచారించిన ఈడీ లేటెస్ట్ గా సెప్టెంబర్ 14న మరో ఇద్దరు నటులకు నోటీసులు జారీ చేసింది. నటి ఊర్వశీ రౌతేలా,  తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మిమి చక్రవర్తికి నోటీసులు జారీ చేసింది.  సెప్టెంబర్  15న విచారణకు హాజరు కావాలని మిమి చక్రవర్తికి.. సెప్టెంబర్ 16న విచారణకు రావాలని నటి ఊర్వశి రౌటేలాకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వీరిద్దరిని 1xBet బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు పిలిచినట్లు ఈడీ తెలిపింది.

బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే ఇండియన్ మాజీ క్రికెటర్లు, సురేష్ రైనా, శిఖర్ ధావన్ ను ఈడీ విచారించింది. ఆగస్టులో  మాజీ క్రికెటర్ సురేష్ రైనాను ఈ కేసులో ఫెడరల్ దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది. శిఖర్ ధావన్ ను బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ 1xBet సోషల్ మీడియా ప్రమోషన్‌లకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా సెప్టెంబర్ 4న దాదాపు 8 గంటలు విచారించింది ఈడీ.  39 ఏళ్ల శిఖర్ ధావన్  ఎండార్స్‌మెంట్ ఒప్పందాల ద్వారా బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌తో పార్ట్ నర్ గా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమైనందును విచారించింది

 ప్రభుత్వం ఇటీవల  చట్టాన్ని ప్రవేశపెట్టి రియల్-మనీ ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే.   గత ఏడాది నుంచి అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించారనే ఆరోపణల కేసులో  అనేక మంది బాలీవుడ్ సౌత్ సిమీ సెలెబ్రిటీలతో పాటు క్రికెటర్లు కూడా ఈ కేసులో  ఉన్నారు. 

 బెట్టింగ్ యాప్ కేసులో టాలీవుడ్ లోనూ విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్‌ రాజ్‌, మంచు లక్ష్మీని ఈడీ విచారించిన  సంగతి తెలిసిందే. ప్రకాశ్‌ రాజ్‌ను 6 గంటలు, విజయ్‌ దేవరకొండను 4 గంటలపాటు విచారించారు ఈడీ అధికారులు