తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చెన్నై - తిరుచ్చి జాతీయ రహదారిపై మధురాంతకంలో ఓ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్ లోనే మృతిచెందారు.15మందికి తీవ్రగాయాలయ్యాయి. యాక్సిడెంట్ ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చెంగల్ పట్టు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పడాలం పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.