హైదరాబాద్ బేగంపేట ఫ్లైఓవర్ పై కారు బీభత్సం.. ట్రాఫిక్ జాం

హైదరాబాద్ బేగంపేట ఫ్లైఓవర్ పై కారు బీభత్సం.. ట్రాఫిక్ జాం

హైదరాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. పంజగుట్ట  నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న  ఓ కారు బేగంపేట ఫ్లై ఓవర్ పై అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టి.. అటుగా వస్తున్న ట్రావెల్స్ బస్సుకు తగిలింది. బస్సు తగిలిన వేగానికి కారు రివర్స్ లో వచ్చి ఫ్లై ఓవర్ వాల్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ తో సహా మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. కారు రోడ్డుకు అడ్డంగా ఉండటంతో తీవ్రమైన ట్రాఫిక్ జాం ఏర్పడింది.

యాక్సిడెంట్ ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కారు రోడ్డుకు అడ్డంగా ఉండటంతో దాన్ని తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ కావడానికి ప్రత్నామ్నాయ మార్గాలు చూస్తున్నారు ప్రజలు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. యాక్సిడెంట్ లో తప్పు ఎవరిదన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.