పీసీసీ రేసులో ఉన్నది ఎవరు.?

పీసీసీ రేసులో ఉన్నది ఎవరు.?

పీసీసీ చీఫ్ పోస్టు కోసం పలువురు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. ఆ పదవిని దక్కించుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. లోక్ సభ ఎన్నికల వరకే సీఎం రేవంత్ ను పీసీసీ చీఫ్ గా కొనసాగిస్తామని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించడం, ఇక పాలనపై పూర్తిస్థాయిలో దృష్టిపెడతానని సీఎం రేవంత్ కూడా ఇటీవల చెప్పడంతో త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ఉంటుందని పార్టీలో ప్రచారం జరుగుతున్నది.

రేసులో ఎవరెవరు? 

  •     డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  •     ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి 
  •     పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్​
  •     ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ 
  •     ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ 
  •     పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 
  •     పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్
  •     మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్