న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఆ పదంలోనే ఉందికదా వైబ్రేషన్.. డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు కొత్త సంవత్సరం ప్రారంభంతో ఘనంగా జరుపుకుంటారు.. ఫ్రెండ్స్ తో పార్టీలు, కుటుంబంతో కలిసి ఈవెంట్సు.. టపాసులు కాల్చడం, ఇష్టమైన ఫుడ్ చేయించుకొని తినడం , లేదా ఆర్డర్ చేసుకోవడం.. కొత్త సంవత్సరం తీర్మానాలు చేసుకోవడం వంటివి రకరకాల యాక్టివిటీస్ చేస్తుంటారు. ఇక చాలామంది పబ్స్, హోటల్స్, ఇంట్లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాంటి వారికోసమే న్యూఇయర్ వేడుకలను మరింత ఉత్సాహభరితంగా చేసేందుకు అక్కడి ప్రభుత్వం హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లను ఓపెన్ గా ఉంచుతోంది.. మందుబాబులకు కిక్కిచ్చే ఈ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఎక్కడ ఆ సౌకర్యం ఏర్పాటు చేసిందో ..వివరాల్లోకి వెళితే..
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది.కొత్త సంవత్సరం వేడుకల్లో మరింత జోష్ నింపేందుకు రాష్ట్రప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.. న్యూఇయర్ రోజు తెల్లవార్లు ఎంజాయ్ చేసేందుకు అనుమతించింది. హోటళ్ళు, క్లబ్బులు, పర్మిట్ రూములు ,బీర్ బార్లను ఉదయం 5 గంటల వరకు తెరిచి ఉంచేందుకు , కస్టమర్లకు సేవలను అందించేందుకు రాష్ట్ర హోంశాఖ అనుమతించడంతో మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు న్యూఇయర్ రాత్రి ని మరింత ఉత్సాహం జరుపుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సాధారణంగా హోటళ్లు, బార్లు, క్లబ్బులు, పర్మిట్ రూములు రాత్రి 1.30గంటలకే మూసేయాలి. ఇయర్ ఎండింగ్ టైంలో పర్యటాకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నిర్వహణ వేళలను పొడిగించింది మహారాష్ట్ర ప్రభుత్వం. రిటైల్ మధ్యం దుకాణాలు, వైన్ షాపులు దేశీయ మద్యం బార్లు రాత్రి 10.30 గంటలకు మూసివేయాల్సి ఉండగా.. తెల్లవారు జామున 1 గంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతిచ్చారు. ఇక టేక్ అవే అమ్మకాల్లో నిబంధల్లో ఎలాంటి మార్పులు లేవు.
ఇక మహారా ష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై హోటళ్లు, రెస్టారెంట్ల ఓనర్లు ఫుల్ కుషీగా ఉన్నారు. టైమింగ్ పెంపు నిర్ణయాన్ని స్వాగతించారు. అధికారులు ముందుగానే ఈ సర్క్యూలర్ జారీ చేయడం వల్ల గందరగోళాన్ని తొలగించిందన్నారు. డిమాండ్ ఉన్నా స్పష్టమైన అనుమతులు లేకపోవడంతో సెల్రబేషన్స్ చివరినిమిషంలో సమస్యలకు దారి తీస్తుందన్నారు.
ఇక ఎక్కువ జనాలు ఉంటే చోట హోటళ్ల నిర్వాహకులు, సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. శాంతిభద్రతలు, సౌండ్ పొల్యూషన్ నియంత్రణ, మద్యం తాగి వాహనాలు నడపడాన్ని అరికట్టడంకోసం నైట్ లైఫ్ హబ్‌ల చుట్టూ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని పోలీసులను కోరారు రెస్టారెంట్లు, బార్లు, హోటళ్ల యజమానులు.
