రూ.1,279 నుంచే ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రూ.1,279 నుంచే ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • వచ్చే ఏడాది మార్చి 31 లోపు ప్రయాణాల కోసం బుక్ చేసుకోవచ్చు

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్ భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ‘ఫ్రీడమ్ సేల్’ ప్రకటించింది.  దేశీయ, అంతర్జాతీయ రూట్లలో  50 లక్షల సీట్లను రూ.1,279 నుంచే  అందిస్తోంది. బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆగస్టు 15 వరకు ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటాయి.  వచ్చే ఏడాది  మార్చి 31 లోపు జరిపే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.  దేశీయ విమానాలకు రూ.1,279 నుంచి, అంతర్జాతీయ విమానాలకు రూ.4,279 నుంచి ధరలు ప్రారంభమవుతాయి. ఈ నెల 10న www.airindiaexpress.com, మొబైల్ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మొదట అందుబాటులోకి వస్తాయి.  ఆ తర్వాత  ఆగస్టు 11-–15 వరకు అన్ని బుకింగ్ ఛానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో అందుబాటులో ఉంటాయి.   ఈ ఆఫర్ ఓణం, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను కవర్ చేస్తుంది. ఇండివిడ్యువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తగ్గట్టు కస్టమైజ్డ్ ధరలను కూడా ఎయిర్ ఇండియా  ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్ ఆఫర్ చేస్తోంది. ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్ లైట్ జీరో చెక్-ఇన్ బ్యాగేజీ’, ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్ వాల్యూ’ ధరలు  దేశీయ రూట్ల కోసం రూ.1,379 నుంచి, అంతర్జాతీయ రూట్ల కోసం రూ.4,479 నుంచి ప్రారంభమవుతాయి. ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్ బిజ్  కింద సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను కొత్తగా కొన్న 40 విమానాల్లో అందుబాటులోకి తెచ్చింది.  కాగా, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రస్తుతం  116 విమానాలతో రోజుకు 500 పైగా సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నడుపుతోంది.  38 దేశీయ, 17 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది.