ఎయిర్‌‌టెల్లో ప్రయారిటీ పోస్ట్‌‌ పెయిడ్ ..నెట్వర్క్ రద్దీగా ఉన్నా నిరంతరాయ కనెక్టివిటీ

 ఎయిర్‌‌టెల్లో ప్రయారిటీ పోస్ట్‌‌ పెయిడ్ ..నెట్వర్క్ రద్దీగా ఉన్నా నిరంతరాయ కనెక్టివిటీ

హైదరాబాద్​, వెలుగు: దేశంలోనే రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్‌‌టెల్ తన పోస్ట్‌‌పెయిడ్ వినియోగదారుల కోసం ప్రయారిటీ పోస్ట్‌‌పెయిడ్ పేరుతో సరికొత్త సేవలను ప్రారంభించింది. నెట్‌‌వర్క్ రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లోనూ అంతరాయం లేని కనెక్టివిటీని అందించడానికి 5జీ స్లైసింగ్ టెక్నాలజీ వాడుతుంది. జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిరంతరం మొబైల్ కనెక్టివిటీపై ఆధారపడే కస్టమర్ల కోసం ఈ సేవలు ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. భారతదేశంలో స్లైసింగ్ ఆధారిత 5జీ సేవలను ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారని సంస్థ తెలిపింది.  ట్రాఫిక్‌‌లో క్లయింట్ కాల్స్ మాట్లాడినా లేదా రద్దీగా ఉండే ప్రదేశాలలో క్యాబ్ బుక్ చేసుకున్నా ఎయిర్​టెల్​ మరింత వేగవంతమైన, నమ్మకమైన నెట్​వర్క్​ను అందిస్తుంది. ఈ సేవలు అన్ని ఎయిర్‌‌టెల్ పోస్ట్‌‌పెయిడ్ ప్లాన్లలో లభిస్తాయి.