RSS ను తీవ్రంగా విమర్శించిన అక్బరుద్దీన్ ఒవైసీ

RSS ను తీవ్రంగా విమర్శించిన అక్బరుద్దీన్ ఒవైసీ

కరీంనగర్, వెలుగు:  RSS వాళ్లు తమ వెంట్రుక కూడా పీకలేరని  మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కరీం నగర్​లో నిర్వహించిన ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మజ్లిస్ మతతత్వ పార్టీ కానే కాదని అన్నారు. ఎంఐఎంను మతతత్వ పార్టీ అని దుష్ప్రచారం చేస్తున్నవాళ్లంతా గాడ్సే వారసులేనని అన్నారు. సమాజం భయపడే వాడినే భయపెడుతుందని ఆయన అన్నారు.

తమకు రాజ్యాంగం మీద ఎంతో గౌరవం ఉందని, దేశంలో మతతత్వ శక్తులు పెరుగుతున్నాయని ఆందోళన చెందేకంటే.. మనలోని లోపాలు గుర్తించాలని అన్నారు. ఇతరులను విమర్శించే ముందు మన తప్పుల్ని కూడా గుర్తించాలని RSS ని ఉద్దేశించి అన్నారు. తాను మెప్పు పొందేందుకు కాదని, అవగాహన పెంచేందుకే కరీంనగర్‌కు వచ్చానన్నారు.