V6 News

అలయ్ బలయ్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్

అలయ్ బలయ్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్

హైదరాబాద్, వెలుగు: దసరా సందర్భంగా ఈ నెల 6న అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అలయ్‌‌ బలయ్ ఫౌండేషన్ చైర్మన్‌‌ విజయలక్ష్మి తెలిపారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌‌లో  జరిగే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌‌గా హాజరవుతారని ఆమె సోమవారం మీడియాకు వెల్లడించారు. 17 ఏండ్లుగా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈసారి చిరంజీవితో పాటు, ఏపీ, హర్యానా, కేరళ గవర్నర్లు, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ రాబోతున్నారని తెలిపారు.

పంజాబీ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. రాష్ట్ర ఉద్యమకారులకు, ప్రముఖులకు సన్మానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని చెప్పారు. హర్యానా గవర్నర్‌‌‌‌గా ఉన్న బండారు దత్తాత్రేయ అలయ్‌‌ బలయ్‌‌ కార్యక్రమాన్ని ఇంతకాలం నిర్వహిస్తూవచ్చారు. ఇప్పుడు ఆయన కూతురు విజయలక్ష్మి ఆ బాధ్యతలు తీసుకున్నారు.