హైదరాబాద్, వెలుగు: నీట్–2026 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల స్టూడెంట్స్ ప్రతిభ కనబరిచారు. మొత్తం 19 మంది 500కుపైగా మార్కులు సాధించారు. డి. రిత్విక్ అత్యధికంగా 647, సిద్దాంత్ చతుర్వేది–564, సయ్యద్ మలాజుద్దీన్–557, వసుల శ్రుత్విక–551, గులామ్ మహమ్మద్ హుస్సేన్–548, బత్తుల అభిజ్ఞ–541, లింగంపల్లి అనంత్ సాయి–540, నార్ల శ్రీహిత–538, శ్రేయాంశ్ ద్వివేది–537, కొండ్ల అక్షిత–522, బొమ్మవరపు రుత్విక్–515, జక్కుల శ్రీవైత్రి–512, టి. హర్షిత–509, సిద్దం సాత్విక–508, ఎ. సత్య బ్రాహ్మిణి–507, బి. అక్షర–505, నిద–502, గుంజేటి రిషిత–501, జహ్రా మాజీద్–501 మార్కులు సాధించి అల్ఫోర్స్ ఖ్యాతిని చాటారు.
‘డాక్టర్స్–30’ పేరిట ప్రత్యేక కోచింగ్ ఇస్తున్నామని, దాని వల్లే విద్యార్థులు మంచి మార్కులు సాధించారని అల్ఫోర్స్ చైర్మన్ డా. వి. నరేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 100 మంది విద్యార్థులు మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల అకుంఠిత దీక్ష, కృషి వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందన్నారు. ఇకముందు కూడా తమ విద్యార్థులను మెడికల్, ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు సాధించే విధంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
