రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు శాట్స్ చైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జాతీయ ఆర్చరీ టోర్నమెంట్ ఫైనల్స్ కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్రంలో అర్చరీ అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి.

