కొత్త సెక్రటేరియట్‌‌కు హై సెక్యూరిటీ

కొత్త సెక్రటేరియట్‌‌కు హై సెక్యూరిటీ
  • వాస్తు ప్రకారం ఈస్ట్ ఫేస్​ నుంచి సీఎం ఎంట్రీ.. ఆరో ఫ్లోర్‌‌‌‌లో చాంబర్
  • ప్రతి ఫ్లోర్‌‌‌‌లో ముగ్గురు మంత్రులు, సంబంధిత శాఖల సెక్రటరీలు
  • క్యాడర్ వారీగా మూడు పార్కింగ్ జోన్లు
  • కొత్త సెక్రటేరియట్‌‌పై కేసీఆర్‌‌‌‌కు ఆఫీసర్ల రిపోర్ట్

హైదరాబాద్, వెలుగు: కొత్తగా కడుతున్న సెక్రటేరియట్‌‌లో హై సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన ఎంట్రన్స్ నుంచి మొదలు అడుగడుగునా నిఘా ఉండనుంది. అక్టోబర్‌‌‌‌లో సెక్రటేరియట్‌‌ను ప్రారంభించాలని భావిస్తున్నందున అధికారులు స్పీడ్​గా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రౌండ్‌‌ ఫ్లోర్‌‌‌‌తో కలిపి ఏడు అంతస్తులు ఉండే సెక్రటేరి యట్‌‌లో సీఎం, మంత్రులు, సెక్రటరీలు, ఇతర ఆఫీసర్లు, స్టాఫ్ ఎక్కడ ఉండాలనే దానిపై ఇటీవల ఆఫీసర్లు కేసీఆర్‌‌‌‌కు రిపోర్ట్‌‌‌‌ను అందించారు. ఈ ప్లాన్ ప్రకారం సెక్రటేరియట్ మెయిన్ బిల్డింగ్‌‌లోకి వెళ్లాలంటే రెండు చెకింగ్ పాయింట్లు దాటాల్సి ఉంటుంది. మొదటిది ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఉంటే.. రెండోది సెక్రటేరియట్‌‌ లోపలికి వెళ్లే దగ్గర ఉండనుంది. సీఎం, హోంమంత్రి పేషీలకు వెళ్లాలంటే అక్కడ మరో సెక్యూరిటీ పాయింట్ దాటాలి. సెక్రటేరియట్ లోపలికి ఎవరు, ఎలా వెళ్లాలనే దానిపై కూడా సపరేట్ రూట్లు, వాటికి పార్కింగ్​ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. అన్నిచోట్ల సీసీ కెమెరాలు పెట్టనున్నారు.

ఎంట్రీ ఆషామాషీ కాదు

గతంలో పాత సెక్రటేరియట్‌‌లోకి వెళ్లినంత ఈజీగా ఇప్పుడు కొత్త సెక్రటేరియట్‌‌కు వెళ్లే అవకాశంలేదు. అప్పట్లో మెయిన్ ఎంట్రీ దగ్గర ఉద్యోగులను ఐడీ కార్డు చూసి పంపించేవాళ్లు. ఆర్జీలతో వచ్చే విజిటర్స్‌‌కు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఎంట్రన్స్‌‌లోనే చెక్ చేసిన తర్వాత లోపలికి అనుమతి లభించేది. కొత్త సెక్రటేరియట్‌‌లో మాత్రం ఫస్ట్ ఎంట్రన్స్‌‌లో విజిటర్స్ వివరాలు, వారి లైవ్ ఫొటో తీసుకుని ఎవరిని కలుస్తున్నారనేది కంప్యూటర్‌‌‌‌లో నమోదు చేసుకుని ఎంట్రీ రిసీట్ ఇస్తారు. తర్వాత నార్మల్ చెకింగ్‌‌తో పాటు, కంప్లీట్ పర్సన్ స్కానింగ్ చేసి సపరేట్​గా నిర్మించిన విజిటర్స్‌‌ రూంకు పంపిస్తారు. అక్కడి నుంచి ఒక్కొక్కరుగా మెయిన్ బిల్డింగ్‌‌కు అనుమతించనున్నారు. లోపలికి వెళ్లే ముందు మరో సెక్యూరిటీ పాయింట్‌‌ను దాటాలె. ఎవరు, ఎవరిని కలిసేందుకు వస్తున్నారో.. ఆ ఫ్లోర్‌‌‌‌లో వారినే కలిసేలా చూడనున్నారు. ఇదంతా తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసుల నిర్వహణలో ఉంటుంది. సీఎం, హోంమంత్రి పేషీల దగ్గర ఇంకో పోలీసు చెకింగ్​ ఉంటుంది.

దసరాకు ప్రారంభించేలా..

ఏడు లక్షల చదరపు అడుగుల్లో నిర్మితమవుతున్న సెక్రటేరియట్ బిల్డింగ్‌‌పై ఇప్పుడు డోమ్స్ బిగింపు జరుగుతున్నది. మొత్తం 33 డోమ్స్ బిగించాల్సి ఉండగా, 13 బిగించారు. ఎలివేషన్ పనులు కూడా కొనసాగుతున్నాయి. సెక్రటేరియట్ నిర్మాణ టెండర్లను 2020 అక్టోబర్‌‌‌‌లో షాపూర్​జీ పల్లోంజీ సంస్థ దక్కించుకుంది. 12 నెలల్లోపు పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. కరోనా కరోనా కారణంగా ఆలస్యమయ్యాయి. తర్వాత డిజైన్లు మార్పులు చేస్తూ వస్తుండటంతో మరింత లేట్ అయింది. ఈ అక్టోబర్‌‌‌‌కు పూర్తి చేసి దసరాకు ప్రారంభించేలా పనులు నడుస్తున్నాయి.

ఆరో ఫ్లోర్‌‌‌‌లో సీఎం, సీఎస్..

కేసీఆర్‌‌‌‌కు ఆరో నంబర్ సెంటిమెంట్. అందుకు అనుగుణంగానే కొత్త సచివాలయంలో ఆరో ఫ్లోర్‌‌ను సీఎం, సీఎస్, సీఎంవో సెక్రటరీలు, ఇతర సీఎంవో సిబ్బందికి కేటాయించారు. ప్రతి ఫ్లోర్‌‌‌‌లో ముగ్గురు మంత్రులకు చాంబర్లు ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. ఏ మంత్రి ఏ ఫ్లోర్‌‌‌‌లో ఉంటే.. ఆ శాఖకు చెందిన ముఖ్య కార్యదర్శులు, సెక్రటరీలు, ఇతర సిబ్బంది అదే ఫ్లోర్‌‌‌‌లో ఉంటారు. ప్రతి మంత్రికి, సంబంధిత సెక్రటరీకి కలిపి ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది. మొత్తం మూడు పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సీఎం ఈస్ట్ ఫేజ్ నుంచే లోపలికి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. గుడి, మసీదు, చర్చితోపాటు క్యాంటీన్, మీడియా రూమ్ ఇతరత్రా వంటివన్నీ మెయిన్ బిల్డింగ్ బయటే ఉండనున్నాయి.