హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు వరంగల్‌లో స్థలం కేటాయింపు

V6 Velugu Posted on Oct 18, 2021

హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ (హెచ్.పి.ఎస్)కు రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌లో స్థలం కేటాయించింది. గత ఐదేళ్లుగా వ‌రంగ‌ల్‌లో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్  అద్దె భ‌వ‌నంలో నడుస్తోంది. భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలన్న స్కూల్‌ విజ్ఞప్తికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. హ‌నుమకొండ జిల్లా ధ‌ర్మసాగ‌ర్ మండ‌లం ఎలుకుర్తి గ్రామంలో పరిధిలో 50 ఎక‌రాల ప్రభుత్వ స్థలాన్ని హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ సొసైటీకి కేటాయిస్తూ మార్కెట్ ధర చెల్లించే విధంగా ప్రభుత్వం జీవో నెంబ‌ర్ 93ని జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోని రాజ్యస‌భ స‌భ్యులు సురేశ్‌రెడ్డి స‌మ‌క్షంలో రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు చేతుల మీదుగా  హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ సొసైటీ వైస్ చైర్మన్‌ గుస్తి జె. నోరియాకు అందజేశారు.


 

Tagged Warangal, Telangana, mp, TS, land, Suresh Reddy, , Hanumakonda district, hyderabad public school, Dharmasagar Mandal, Yelukurthy village, Minister Yerrebelli Dayakar Rao, yerrebelli

Latest Videos

Subscribe Now

More News