పాలిసెట్ ఫైనల్ ఫేజ్ సీట్ల అలాట్‌‌మెంట్ పూర్తి

పాలిసెట్ ఫైనల్ ఫేజ్ సీట్ల అలాట్‌‌మెంట్ పూర్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీల్లో ఫైనల్ ఫేజ్ సీట్ల అలాట్‌‌మెంట్ పూర్తయింది. మొత్తం 28,562 సీట్లు ఉండగా, వాటిలో 20,709 నిండాయి. మరో 7,853 సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 118 కాలేజీలుంటే, 24 కాలేజీల్లో వంద శాతం సీట్లు నిండాయని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.

54 ప్రభుత్వ కాలేజీల్లో 11,174 సీట్లకు గాను 10,448 సీట్లు నిండగా, 63 ప్రైవేటు కాలేజీల్లో 16,410 సీట్లకు గాను 10,064 సీట్లు, ఒక ఎయిడెడ్ కాలేజీలో 230 సీట్లకు గాను 197 సీట్లు భర్తీ అయ్యాయని వెల్లడించారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో 393 మందికి సీట్లు అలాట్ చేసినట్టు చెప్పారు. 8 బ్రాంచుల్లో వంద శాతం సీట్లు నిండాయని తెలిపారు. కాగా, సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల10 వరకు ఫీజు కట్టి, కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు.