ముంబై : కెరీర్ ప్రారంభంలో లిమిటెడ్ ఓవర్ స్పెషలిస్ట్‌గా ముద్ర పడిన టీమిండియా పేసర్ బుమ్రా టెస్ట్‌ల్లో అరంగేట్రంతో తన కల నిజమైందన్నాడు. ఈ ఫార్మాట్‌పై తన ముద్ర వేస్తానన్నాడు. ఇప్పటివరకు 12 టెస్ట్‌లాడిన బుమ్రా అప్పుడే 62 వికెట్లు తీశాడు. ‘నేను టెస్ట్‌లకు చాలా ప్రాధాన్యమిస్తా, రెడ్‌బాల్ క్రికెట్ ఆడడానికే ఇష్టపడతా, టీ20, వన్డే స్పెషలిస్ట్ అనే ముద్ర వేయించుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడను. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో బాగా ఆడా. దాంతో టెస్ట్‌ల్లో కూడా రాణిస్తాననే నమ్మకముండేది. ఇప్పటిదాకా 12 మ్యాచ్‌లే ఆడా. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టిన రెండేళ్లకు టెస్ట్ అరంగేట్రం చేశా, దాంతో నా కల నెరవేరింది. వైట్ జెర్సీ ధరించడం గొప్ప అనుభూతి, జట్టు విజయంలో భాగం కావడం సంతృప్తి నిస్తుంది’అని అన్నాడు. స్వదేశంలో టెస్ట్ క్రికెట్ అంటే ఎప్పుడూ సవాలే అన్న బుమ్రా సౌతాఫ్రికా సిరీస్‌లో ఆశించిన ఫలితం రాబడతామనే నమ్మకం ఉందన్నాడు. ఇంగ్లండ్‌లో ఆడిన తర్వాత ఔట్‌స్వింగర్లపై పట్టుపెరిగిందన్నాడు.

