హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎలక్షన్స్ నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల11న పోలింగ్ ఉండటంతో ఎగ్జామ్స్ రీషెడ్యూల్ చేసినట్టు వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ భోజు శ్రీనివాస్ సోమవారం తెలిపారు. వాయిదా పడిన డిగ్రీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 17 నుంచి మార్చి 10 వరకు నిర్వహించనున్నట్టు చెప్పారు.
పరీక్షలకు మూడు రోజుల ముందు నుంచే హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆఫీసర్లు పేర్కొన్నారు. స్టూడెంట్లు www.braouonline.in వెబ్‌సైట్ నుంచి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
