అమీర్పేట స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి: లక్ష్మీనారాయణ

అమీర్పేట స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి: లక్ష్మీనారాయణ

పంజాగుట్ట, వెలుగు: లోకాయుక్త ఆదేశాలను అమలు చేయాలని అమీర్​పేటకు చెందిన సీనియర్​సిటిజన్​ లక్ష్మీనారాయణ కోరారు. అమీర్​పేట నుంచి పంజాగుట్ట వరకు రహదారి విస్తరణ కోసం 2009లో ప్రభుత్వం సేకరించిన భూమిని స్వాధీనం చేసుకోవాలని లోకాయుక్త ఆదేశాలిచ్చిందన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్‎లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

లోకాయుక్త ఆదేశాలను అమలు విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అమీర్​పేట చౌరస్తాలో 198 గజాల స్థలానికి ప్రభుత్వం రూ.86 లక్షల పరిహారం చెల్లించిందన్నారు. ఇప్పటికీ భూమిని స్వాధీనం చేసుకోకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పరిహారం తీసుకున్నవారు సదరు స్థలంలో భారీ భవనం నిర్మించి, రూ.లక్షలు గడిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని, ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలని కోరారు.