Amelia Kerr: న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా మహిళల రెండో వన్డే వెల్లింగ్టన్ వేదికగా జరిగింది. ఈ మ్యాచులో కివీస్ అమ్మాయిల జట్టు చారిత్రత్మక విజయాన్ని నమోదు చేసింది. సఫారీ జట్టు నిర్ధేశించిన 347 పరుగుల టార్గెట్ న్ని చేధించి టీమిండియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును న్యూజిలాండ్ తిరగరాసింది. ఉమెన్స్ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు ఛేజ్ చేసిన జట్టుగా బ్లాక్ క్యాప్స్ రికార్డుల్లోకి ఎక్కింది. కాగా ఇంతకు ముందు ఈ హిస్టరీ భారత మహిళల జట్టు పేరుపై ఉండేది. వన్డే ప్రపంచకప్-2025లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ లో ఉమెన్ ఇన్ బ్లూ.. 339 రన్స్ లక్ష్యాన్ని చేజ్ చేసింది. ఇప్పుడు ఈ రికార్డును న్యూజిలాండ్ బ్రేస్ చేసేసింది. ఈ మ్యాచ్ మొదట బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 346 రన్స్ చేయగా.. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో అన్నేకే బోష్ (91), కెప్టెన్ లారా వోల్వార్డ్(69), ట్రయోన్(52), జాఫ్టా(37) అద్భుతంగా ఆడారు.
ఇక ఈ భారీ లక్ష్య చేధన కోసం బరిలోకి దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లు సుజీ బేట్స్(8), ప్లిమ్మర్(23), మ్యాడీ గ్రీన్(13) ఘోరంగా విఫలం కావడంతో కెప్టెన్ అమెలియా కెర్ మాత్రం సంచలన ఇన్నింగ్స్ ఆడింది. ఓ వైపు క్రమంగా వికెట్లు పడుతున్నప్పటికి ఆమె మాత్రం తన విధ్వంసకర బ్యాటింగ్ ని కొనసాగించింది. చివరి ఓవర్లో 11 పరుగులు కావాల్సి ఉండగా.. కేర్ వరుసగా 3 బౌండరీలు బాది కివీస్ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఈ మ్యాచులో కెప్టెన్ అమేలియా కెర్ కేవలం 139 బంతుల్లో 23 ఫోర్లు, ఒక సిక్సుతో 179 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.
ALSO READ : లక్నో vs ఢిల్లీ జట్లలో ఈరోజు ఏది గెలుస్తుందో తెలుసా!
మొత్తంగా మహిళల వన్డే క్రికెట్లో లక్ష్య చేధనలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రెండో ప్లేయర్ గా అమెలియా కేర్ నిలిచింది. అలాగే న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన మహిళ ప్లేయర్ గా కూడా కేర్ చరిత్ర నెలకొల్పింది. మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా ప్రెజెంటేషన్‌లో కేర్ మాట్లాడుతూ.. ఈ ఇన్సింగ్స్ నాకు చాలా ప్రత్యేకమైనది. మేము డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నప్పుడు కూడా గెలవగలమని నమ్మా, నేను మైదానంలోకి వెళ్లిన తర్వాత ముందుకు సాగాల్సిందేనని ఫిక్స్ అయినట్లు వెల్లడించింది.
A HISTORIC CHASE LEAD BY CAPTAIN AMELIA KERR 🥶🔥
— Johns. (@CricCrazyJohns) April 1, 2026
- Highest chase in Women's ODI history with Kerr 179*(139) pic.twitter.com/6zQX2sJa8v
