IPL 2026: లక్నో vs ఢిల్లీ జట్లలో ఈరోజు ఏది గెలుస్తుందో తెలుసా!

IPL 2026: లక్నో vs ఢిల్లీ జట్లలో ఈరోజు ఏది గెలుస్తుందో తెలుసా!

IPL 2026: IPLలో మరో మ్యాచ్.. ఏప్రిల్ 1న లక్నో Vs ఢిల్లీ క్యాపిటల్  మధ్య పోరు. రెండు జట్లకు ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ ఇదే. లక్నోకు రిషబ్ పంత్ కెప్టెన్ అయితే.. ఢిల్లీకి అక్షర్ పటేల్ నాయకత్వం వహిస్తున్నాడు. రెండు జట్లు బలంగానే ఉండటంతో.. ఈ మ్యాచ్ రసవత్తంగానే సాగుతుందని అంచనా. 

గత సీజన్ చేదు జ్ఞాపకాలను చెరిపివేస్తూ.. సరికొత్త ఉత్సాహంతో ఈ సీజన్ ప్రారంభించాలని లక్నో జట్టు కసితో బరిలోకి దిగుతోంది. ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ లాంటి స్టార్ విదేశీ ఆటగాళ్లతో లక్నో బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. బౌలింగ్ లో మొహమ్మద్ షమీ మినహా మిగిలిన వారు అంత పెద్దగా  అనుభవంలేని వారు కావడంతో లక్నో జట్టుకు కొంత ఆందోళన కలిగించే అంశం.

ఇక.. అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ పాత కోర్ టీమ్‌ను కొనసాగిస్తుంది. కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్, మిచెల్ స్టార్క్ వంటి కీలక ఆటగాళ్లని అట్టి పెట్టుకుంది. గత సీజన్‌లో ఐదో స్థానంలో నిలిచిన ఢిల్లీ.. ఈసారి ఎలాగైనా ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉంది.

పిచ్ రిపోర్ట్: 
లక్నోలోని ఏకనా స్టేడియం పిచ్ సాధారణంగా మొదట బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలిస్తుంది. ఇక్కడ సగటు స్కోరు 150 నుంచి -160 మధ్య నమోదు అవుతుంది. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ పిచ్ స్లో అవుతుంది. దీని వల్ల ఛేజింగ్ చేయడం కష్టం అవుతుంది. కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేసే బౌలర్లు ఇక్కడ వికెట్లు తీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఎవరు గెలుస్తారంటే: 
భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసే జట్టు దాదాపుగా మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఛేజింగ్ చేసే జట్టు స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనఫ్ ఉండే విజయం సాధించేందుకు 75 శాతం ఛాన్స్ ఉందని క్రికెడ్ పండితులు పేర్కొంటున్నారు. 

హెడ్-టు-హెడ్ రికార్డులు: 
* లక్నో వర్సెస్ ఢిల్లీ మధ్య మొత్తం మ్యాచ్‌లు 07 జరిగాయి..  
* 3 మ్యాచులలో లక్నో విజయం
* 4 మ్యాచులు గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్

తుది జట్ల అంచనా
లక్నో సూపర్ జెయింట్స్: 
మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, అన్రిచ్ నోర్ట్జే, మొహమ్మద్ షమీ, అవేష్ ఖాన్, మయాంక్ యాదవ్, దిగ్వేష్ రాఠీ.
ఇంపాక్ట్ ప్లేయర్: షాబాజ్ అహ్మద్

ఢిల్లీ క్యాపిటల్స్:
పాతుమ్ నిస్సంక, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్ (కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, ఆకిబ్ నబీ, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి.
ఇంపాక్ట్ ప్లేయర్: టి. నటరాజన్