గల్ఫ్ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియదు కానీ బంగారం, వెండి రేట్లు మాత్రం ఆగకుండా ముందుకు సాగుతున్నాయి. ఒక పక్క యుద్ధం ముగుస్తుందని అమెరికా ప్రకటనలతో గోల్డ్ రోజురోజుకూ పెరుగుతోంది. మరోపక్క భారత ప్రభుత్వం దిగుమతుల కట్టడికి పెంచిన పన్నుల పోటు బంగారు ప్రియులకు చుక్కలు చూపిస్తోంది. దీంతో గ్రాము స్వచ్ఛమైన బంగారం మళ్లీ రూ.16వేల మార్కుకు దగ్గరకు చేరింది. ఈ క్రమంలో గోల్డ్ అండ్ సిల్వర్ షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లోని మారిన రేట్లను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం మంచిది.
మే21న బంగారం రేట్లు పెరిగాయి. మే 20 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.49 పెరిగాయి. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 993గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 660గా కొనసాగుతోంది.
గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మే 21, 2026న కేజీకి రూ.5వేలు పెరిగింది దేశవ్యాప్తంగా. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 90వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపుగా రూ.290 దగ్గర ఉంది.
