గందరగోళ ప్రపంచ ఆర్థిక పరిస్థితులతో బంగారం, వెండికి సరైన దిశా దశ కొరవడింది. ప్రధానంగా ఈ రెండింటి దిగుమతులను భారత ప్రభుత్వం తగ్గించాలని నియంత్రణలు పెట్టడంతో పాటు పన్నులను పెంచటంతో చాలా మంది ఈ లోహాల కొనుగోలుకు దూరంగా జరుగుతున్నారు. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న వారు ముందుగా తమ నగరాల్లో మంగళవారం మారిన ధరలను పరిశీలించటం ముఖ్యం.
మే 19న బంగారం రేట్లు పెరిగాయి. మే 18 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.82 పెరిగాయి. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 704గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 395గా కొనసాగుతోంది.
మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మే 19, 2026న కేజీకి రూ.5వేలు తగ్గింది దేశవ్యాప్తంగా. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు ఎలాంటి మార్పులు లేకుండా రూ.3లక్షలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపుగా రూ.300 దగ్గర కొనసాగుతుందన్నమాట.
