మార్చి 31లోపు దేశానికి మావోయిస్టుల హింస నుంచి విముక్తి : కేంద్ర హోం మంత్రి అమిత్ షా 

మార్చి 31లోపు దేశానికి మావోయిస్టుల హింస నుంచి విముక్తి : కేంద్ర హోం మంత్రి అమిత్ షా 

పూరి: మావోయిస్టుల హింస నుంచి దేశానికి ఈనెల 31 లోపు విముక్తి కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. తిరుపతి నుంచి పశుపతి వరకు రెడ్ కారిడార్​ను తుడిచివేస్తామన్నారు. ఒడిశాలోని మహానందిలో శుక్రవారం నిర్వహించిన ‘57వ రైజింగ్ డే’ వేడుకల్లో ఆయన పాల్గొని రూ.890 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు.

పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మావోయిస్టుల హింస నుంచి దేశానికి విముక్తి కల్పించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఈ విషయంలో తెలంగాణ, ఒడిశా, చత్తీస్ గఢ్  వంటి రాష్ట్రాల్లో సీఐఎస్ఎఫ్​ బలగాల సాయంతో అనుకున్నది సాధించామని చెప్పారు. ‘‘సీఐఎస్ఎఫ్  సిబ్బంది మరింత బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నారు.

దేశంలోని కీలక పోర్టుల రక్షణ బాధ్యతను వారికి ఇవ్వాలని నిర్ణయించాం. కొన్నేళ్లలో సీఐఎస్ఎఫ్​  పోర్ట్ ఫోలియోకు నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్ట్, నవీ ముంబై ఎయిర్​పోర్ట్, ఎన్టీపీసీ స్థావరాలు వంటి వివిధ ఎస్టాబ్లిష్​మెంట్లను కూడా జతచేశాం” అని షా పేర్కొన్నారు.