చెన్నై: తమిళనాడులో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సీఎం విజయ్ 300 ప్రభుత్వ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. దాదాపు 127 కోట్లతో కొనుగోలు చేసిన 3 వందల డీజిల్, సీఎన్జీ బస్సులను తమిళనాడు సీఎం విజయ్ గురువారం జెండా ఊపి ప్రారంభించారు.
సీఎం విజయ్ మెరీనా బీచ్ వరకూ కొత్త బస్సులో టికెట్ కొనుక్కుని ప్రయాణం చేశారు. టికెట్ కొనే సమయంలో కండక్టర్ల అందరి కామన్ కంప్లైంట్ టికెట్కు సరిపడ చిల్లర ఇవ్వండని. ఈ సమస్య లేకుండా విజయ్ టికెట్కు సరిపడ చిల్లరతో టికెట్ కొనుగోలు చేయడం విశేషం.
#JUSTIN : சரியான சில்லறை கொடுத்து டிக்கெட் வாங்கி பயணம் மேற்கொண்ட முதலமைச்சர் விஜய் #CMVijay | #Vijay | #NewBuses | #PolimerNews pic.twitter.com/cNN7HpBzMl
— Polimer News (@polimernews) June 25, 2026
కొత్త బస్సులు చెన్నైతో సహా ఆరు ట్రాన్స్పోర్ట్ జోన్లలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. తమిళనాడు ప్రజా రవాణా వ్యవస్థ దేశంలోనే అతిపెద్ద ప్రజా రవాణా సదుపాయాల్లో ఒకటిగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల నెట్‌వర్క్ ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.
సుదూర ప్రయాణ సేవలను అందించే స్టేట్ ఎక్స్‌ప్రెస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (SETC) ప్రస్తుత కేటాయింపులో భాగం కాకపోవడం గమనార్హం. ముఖ్యంగా తమిళనాడులోని ప్రధాన నగరాల్లో ఈ కొత్త బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
