బర్త్‌డే పార్టీ కాదు, జిమ్‌లో Hard Work ముఖ్యం బిగులు.. మెస్సీ వర్కౌట్ వీడియో వైరల్!

బర్త్‌డే పార్టీ కాదు, జిమ్‌లో Hard Work ముఖ్యం బిగులు.. మెస్సీ వర్కౌట్ వీడియో వైరల్!

Lionel Messi Workout: ఫుట్‌బాల్ లెజెండ్, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీకి రెస్ట్ అనే పదమే తెలియదేమో! బుధవారం (జూన్ 24) తన 39వ పుట్టినరోజును జరుపుకున్న ఈ గ్లోబల్ ఐకాన్, బర్త్‌డే వేడుకల్లో మునిగిపోకుండా తమ తదుపరి పోరు కోసం జిమ్‌లో తీవ్రంగా శ్రమించాడు. ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలోనే ఆల్‌టైమ్ లీడింగ్ గోల్ స్కోరర్ గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన మెస్సీ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పూర్తి ఇంటెన్సిటీతో అప్పర్ బాడీ, ఆర్మ్స్ వర్కవుట్ చేస్తున్న వీడియోను షేర్ చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

వరల్డ్ కప్ హిస్టరీలోనే నెం.1:
ఆస్ట్రియాపై లియోనల్ మెస్సీ సాధించిన మైండ్ బ్లోయింగ్ బ్రేస్ (రెండు గోల్స్)తో అతను ఫుట్‌బాల్ హిస్టరీలోనే అత్యున్నత శిఖరానికి చేరుకున్నాడు. వరల్డ్ కప్ చరిత్రలో జర్మనీ లెజెండ్ మిరోస్లావ్ క్లోజ్ (16 గోల్స్) రికార్డును బద్దలు కొట్టి, ఏకంగా 18 గోల్స్‌తో ప్రపంచ కప్ హిస్టరీలోనే అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా మెస్సీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కాగా వరల్డ్ కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ప్లేయర్‌గా క్లోజ్ (17 విజయాలు) రికార్డును అధిగమించి, 18వ ప్రపంచ కప్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా ఆరు వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టిన ఫ్రాన్స్ స్టార్ జస్ట్ ఫోంటైన్, బ్రెజిల్ లెజెండ్ జైర్జినోల అరుదైన రికార్డును మెస్సీ ఈక్వల్ చేసేశాడు. 

రష్యా లెజెండ్ సరసన మెస్సీ: 
ఈ టోర్నీలో అర్జెంటీనా చేసిన మొత్తం 5 గోల్స్ (అల్జీరియాపై హాట్ ట్రిక్, ఆస్ట్రియాపై రెండు గోల్స్) మెస్సీనే కొట్టడం విశేషం. ఒకే వరల్డ్ కప్ ఎడిషన్‌లో తన దేశం చేసిన మొదటి 5 గోల్స్ తానే కొట్టిన రెండో ప్లేయర్‌గా మెస్సీ రికార్డు సృష్టించాడు. 1994లో రష్యా తరపున ఒలేగ్ సాలెంకో మాత్రమే ఈ ఫీట్ సాధించాడు.

ఏజ్ జస్ట్ నంబర్: 
ఆస్ట్రియా మ్యాచ్‌లో లియోనల్ మెస్సీ ఏకంగా 71 సార్లు బంతిని టచ్ (71 touches) చేశాడు. 1966 తర్వాత ఒక వరల్డ్ కప్ మ్యాచ్‌లో 50+కి పైగా టచ్‌లు సాధించిన మోస్ట్ సీనియర్ స్ట్రైకర్‌గా 39 ఏళ్ల మెస్సీ రికార్డు సృష్టించాడు. కాగా మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా ఇప్పటికే రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించగా, జూన్ 28వ తేదీన టెక్సాస్ వేదికగా జోర్డాన్‌తో తమ చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది.