
గుజరాత్ లోని గాంధీనగర్ లోక్ సభ స్థా నానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం నామినేషన్ వేశారు. కేం ద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఆయన వెంట ఉన్నా రు. అయితే అమిత్ షా నామినేషన్ వేయడానికి ముందు ఆసక్తికరమైన సంఘటన జరిగింది. తన మనవరాలికి బీజేపీ కార్యకర్తలు పెట్టుకునే టోపీ పెట్టడానికి షా ప్రయత్నించారు.ఆ చిన్నా రి మాత్రం దాన్ని పెట్టుకోవడానికి ఒప్పుకోలేదు. రెండు మూడు సార్లు అమిత్ షా, ఆయన పక్కన ఉన్నవారు ప్రయత్నించి నా ఆమె పెట్టుకోలేదు. బీజేపీ టోపీని తీసేసి తన టోపీనే పెట్టుకుం ది. షా మనవరాలు బీజేపీ టోపీని వద్దంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.