ప్రముఖ సింగర్స్ చిన్నప్పటి ఫోటో షేర్ చేసిన బిగ్ బీ

ప్రముఖ సింగర్స్ చిన్నప్పటి ఫోటో షేర్ చేసిన బిగ్ బీ

బిగ్ బీ అమితాబ్ మంగళవారం తన ట్విటర్ లో ప్రముఖ సింగర్స్ యొక్క చిన్ననాటి ఫోటోని షేర్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ కలర్ లో.. చిన్న గౌనులో ఉన్న ఆ ఇద్దరిలో ఒకరు లతా మంగేష్కర్ మరొకరు ఆశా భోంస్లే.

మంగళవారం ఉదయం లతా మంగేష్కర్ తన ఆధ్యాత్మిక గురువు పండిట్ జమ్మూ మహారాజ్ మరియు దివంగత కవి నరేంద్ర శర్మ గురించి ట్వీట్ చేశారు. వారి వర్ధంతి సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ ట్విటర్ లో పోస్ట్ పెట్టారు.

ఈ పోస్ట్ కు బిగ్ బీ స్పందిస్తూ..”ఇది లతా జీ మరియు ఆశా జీ యొక్క చిన్ననాటి ఫోటో. ఈ రోజు ఉదయం ఓ ట్వీట్‌లో లతా జీ తన గురువులను ఎలా గుర్తుంచుకుంటున్నారో నేను చదివాను, అకస్మాత్తుగా నేను ఆమె చిన్ననాటి ఫోటోను చూశాను.!” అని ట్వీట్ చేశారు.