నిలకడగా అమితాబ్ బచ్చన్ హెల్త్ కండీషన్

నిలకడగా అమితాబ్ బచ్చన్ హెల్త్ కండీషన్

ముంబై: బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తోపాటు ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్‌కు శనివారం కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. పాజిటివ్ అని తేలిన వెంటనే ట్రీట్‌మెంట్‌ కోసం ముంబైలోని నానావతి ఆస్పత్రిలో అమితాబ్ చేరారు. ప్రస్తుతం ఆయన హెల్త్ కండీషన్ మెరుగ్గా ఉందని నానావతి ఆస్పత్రి ఆదివారం ఉదయం ఓ ప్రకటనలో తెలిపింది. ‘అమితాబ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయనకు తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. నానావతి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ యూనిట్‌లో ఆయన అడ్మిట్ అయ్యారు. తన హెల్త్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను ట్విట్టర్‌‌ ద్వారా చెబుతానని బచ్చన్ అన్నారు’ అని నానావతి హాస్పిటల్ పేర్కొంది. 

తనకు కరోనా పాజిటివ్‌గా వచ్చిందని, ఆస్పత్రిలో చేరినట్లు శనివారం అమితాబ్ ట్వీట్ చేశారు. కరోనా టెస్టింగ్స్‌లో తనకూ పాజిటివ్‌గా వచ్చిందని అభిషేక్ బచ్చన్ కూడా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, అమితాబ్ భార్య జయా బచ్చన్, అభిషేక్ సతీమణి ఐశ్వర్యారాయ్, కూతురు ఆరాధ్యకు టెస్టుల్లో నెగిటివ్‌గా వచ్చింది.