- జైలు నుంచి విడుదలై ఆత్మహత్య చేసుకున్న యువకుడు
- తప్పుడు కేసులతో జైలుకు పంపారని నోట్
- అమూల్యశ్రీ కేసులో ఊహించని పరిణామం
మలక్ పేట, వెలుగు: పోలీసుల వేధింపులు, సోషల్ మీడియాలో పోస్టుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అమూల్యశ్రీ సూసైడ్ కేసులో జైలుకెళ్లిన మహేశ్ నోట్‌రాసి, సూసైడ్ చేసుకున్నాడు. సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన అమూల్యశ్రీ, చింతలబస్తీకి చెందిన మేఘావత్ మహేశ్(20) ప్రేమించుకున్నారు. పెద్దలు మందలించడంతో గత జూన్ లో ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
దీంతో మృతురాలి బంధువులు మహేశ్, అతని తండ్రి వాల్ సింగ్ పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్‌చేసి జైలుకు తరలించారు. మహేశ్ ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు. మంగళవారం ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. అంతకుముందు సూసైడ్ నోట్రాశాడు. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని, తన చావుకు అమూల్యశ్రీ బంధువులే కారణమని, పోలీసులు కూడా వేధించారని పేర్కొన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
