మగబిడ్డకు జన్మనిచ్చిన అమీజాక్సన్

మగబిడ్డకు జన్మనిచ్చిన అమీజాక్సన్

పెళ్లికి ముందే తల్లి అయిన బ్రిటీష్ బ్యూటీ అమీ జాక్సన్

లండన్ : భారతీయ సినిమాలతో పాపులరైన లండన్ బ్యూటీ అమీ జాక్సన్ మగబిడ్డకు జన్మనిచ్చింది. కాబోయే భర్త జార్జ్ (george panayiotou), కన్నకొడుకుతో కలిసి ఉన్న ప్రేమపూర్వక ఫొటోను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. “దేవుడు కొడుకును గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆండ్రియాస్ కు ఈ ప్రపంచంలోకి వెల్ కమ్” అని ఆమె క్యాప్షన్ పెట్టారు.

పుట్టిన బిడ్డకు పాలిస్తుండగా… తన నుదిటిపై జార్జ్ ముద్దుపెట్టుకుంటున్న ఫొటోను అమీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటో ఇన్ఫర్మేషన్ చూసిన… చాలామంది సెలబ్రిటీలు, ఫ్రెండ్స్ ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు.

అమీ 27 ఏళ్ల వయసులో తల్లి అయింది. యూకేలో పుట్టిన అమీ జాక్సన్.. 2009 మిస్ టీన్ వరల్డ్ బ్యూటీ పేజాంట్ లో విన్నర్ అయింది. ఆ తర్వాత యూఎస్ లో మోడలింగ్ కెరీర్ మొదలుపెట్టింది. 2010లో తమిళ సినిమా మదరాసి పట్టణమ్ తో ఇండియన్ సినిమాకు పరిచయం అయింది అమీ. తెలుగులో రామ్ చరణ్ ఎవడు మూవీలో నటించింది. భారతీయ దిగ్గజ దర్శకుడు శంకర్ సినిమాలైన ఐ(మనోహరుడు), 2.0 ల్లో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించి క్రేజ్ పెంచుకుంది.

పెళ్లికి ముందే గర్భం దాల్చింది అమీ జాక్సన్. ఫియాన్సే జార్జ్ పనయోటోతో సహజీవనం చేస్తోంది. ప్రెగ్నెన్సీ తో సినిమాలకు గ్యాప్ ఇచ్చింది అమీ జాక్సన్. ప్రెగ్నెన్సీ టైమ్ లోనూ మాతృత్వాన్ని ఆనందిస్తున్నానంటూ ఫొటోలను పోస్ట్ చేసింది. ఐతే… ఈ ఫొటోలకు మిశ్రమ స్పందన వచ్చింది.

View this post on Instagram

Our Angel, welcome to the world Andreas ?

A post shared by Amy Jackson (@iamamyjackson) on