గొంతులో మాంసం ముక్క ఇరుక్కుని.. చనిపోయాడు

గొంతులో మాంసం ముక్క ఇరుక్కుని.. చనిపోయాడు

మిడ్జిల్, వెలుగు: గొంతులో మాంసం ముక్క ఇరుక్కుని ఓ వ్యక్తి మృతిచెందాడు. మహబూబ్​నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి పంచాయతీ చేదుగుట్ట తండాకు చెందిన చంద్రునాయక్(59) అదే గ్రామంలో ఉంటున్న చెల్లెలి ఇంట్లో శుభకార్యానికి వెళ్లాడు. మంగళవారం రాత్రి 9.30 గంటలకు విందు భోజనం చేస్తుండగా గొంతులో మాంసం ముక్క ఇరుక్కుంది. దీంతో ఊపిరాడక చాలాసేపు ఇబ్బంది పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతిచెందాడు.