14రోజుల క్వారంటైన్ లో ఉంటేనే రాష్ట్రానికి రండి

14రోజుల క్వారంటైన్ లో ఉంటేనే రాష్ట్రానికి రండి

కరోనా వైరస్ నేపథ్యంలో  స్వగ్రామాలకు వచ్చే వారు తమ ఆధీనంలో ఉన్న క్వారంటైన్ లో ఉండాలని…అలా ఉంటేనే రాష్ట్రానికి రావాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్వగ్రామాలకు వచ్చేందుకు ప్రయత్నించిన ప్రయాణికులను తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న  పోలీసులు వారిని నిలిపివేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఎవరైనా సరే తప్పనిసరిగా 14రోజుల  క్వారంటైన్ లో ఉండాలని,  క్వారంటైన్ పూర్తయిన తరువాత వారి వారి స్వగ్రామాలకు పంపిస్తామని అన్నారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు డాక్టర్లను పంపిస్తామని, కరోనా వైరస్ టెస్ట్ ల అనంతరం హోం క్వారంటైన్ కు పంపిస్తున్నట్లు చెప్పారు.

నూజివీడు ట్రిపుల్ ఐటీలో క్వారంటైన్ ఏర్పాటు

ఇదిలా  క్వారంటైన్ కు అంగీకరించిన వారిని నూజివీడు ట్రిపుల్ ఐటికి పంపించేందుకు ఏపీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. దీంతో  క్వారంటైన్ అంగీకరించిన వారిని బస్సుల్లో తరలిస్తుండగా…క్వారంటైన్ కు ఒప్పుకోని వారు నగరానికి తిరుగు ప్రయాణ మయ్యారు.

దీంతో తెలుగు రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్ట్ లు వేలాది మంది విద్యార్ధులు, ప్రజలతో కిక్కిరిసి పోయాయి. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీస్ యంత్రంగా ప్రయత్నిస్తుంది.