దాక్షాయణి ఈజ్ బ్యాక్

దాక్షాయణి ఈజ్ బ్యాక్

యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బుల్లితెరపై ఆకట్టుకున్న అనసూయ భరద్వాజ్.. డిఫరెంట్ స్ర్కిప్టులతో వెండితెర ప్రేక్షకులనూ అలరిస్తోంది. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌‌‌‌‌‌‌‌ చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది. ‘పుష్ప’ చిత్రంలో ఆమె పోషించిన  దాక్షాయణి పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. ప్రస్తుతం ‘పుష్ప2’లోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. బుధవారం అనసూయ పుట్టినరోజు సందర్భంగా ‘దాక్షాయణి ఈజ్ బ్యాక్’ అంటూ ఆమె కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్.  

చీర కట్టుకుని మాస్ లుక్‌‌‌‌‌‌‌‌లో అనసూయ కనిపిస్తుండటంతో తన పాత్రపై అంచనాలు పెరుగుతున్నాయి. ‘పుష్ప ది రైజ్’లో సునీల్‌‌‌‌‌‌‌‌కు జంటగా ఆమె పోషించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. దీంతో ‘పుష్ప ది రూల్’ చిత్రంపై  ఆసక్తి ఏర్పడింది. అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో

రూపొందుతోన్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా విడుదల కానుంది.