ఈఎస్ఐ మందుల కొనుగోలులో మరో భారీ కుంభకోణం

ఈఎస్ఐ మందుల కొనుగోలులో మరో భారీ కుంభకోణం

హైదరాబాద్‌: ఈఎస్ఐ మందుల కొనుగోలులో మరో భారీ కుంభకోణం బ‌య‌ట‌ప‌డింది. మందులు కొనుగోలు సరఫరా ఆధారంగా ఏసీబీ కొత్త కేసు నమోదు చేసింది. ఆరుగురు ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ ప్రస్తుతం సోదాలు చేస్తోంది.

ఈఎస్ఐ మందుల కొనుగులు లో మరో స్కాంని గుర్తించిన ఏసీబీ అధికారులు కంచర్ల శ్రీ హరి బాబూ అలియాస్ బాబ్జీ , కంచర్ల సుజాత, కుక్కల కృపాసాగర్‌రెడ్డి, బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజు, తింకశల వెంకటేష్ వంటి తొమ్మిది మంది ఇళ్ళలో ఏక కాలంలో సోదాలు జరుపుతున్నారు. ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ దేవిక రాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్‌ వసంత ఇందిరపై కూడా ఈ విషయంలో మరో కేసు నమోదయింది. ప్రైవేటు సంస్థల నుంచి మందుల కోనుగోలు కోసం భారీగా ముడుపులుముట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.