Samyuktha Menon: మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్న సంయుక్త మీనన్.. హీరో ఎవరో తెలుసా?

Samyuktha Menon:  మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్న సంయుక్త మీనన్.. హీరో ఎవరో తెలుసా?

మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్(Samyuktha Menon) తెలుగులో వరుస ఆఫర్స్ దక్కించుకుంటోంది. విరూపాక్ష సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఈ సినిమా తరువాత వరుసగా క్రేజీ ఆఫర్స్ ని అందుకుంది. ప్రస్తుతం నిఖిల్ సిద్దార్థ్ హీరోగా వస్తున్న ప్రెస్టిజియర్ ప్రాజెక్ట్ స్వయంభూలో నటిస్తున్న విషయం తెలిసిందే. పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 

ఇదిలా ఉంటే.. తాజాగా తెలుగులో మరో క్రేజీ ఆఫర్ దక్కించుకుందట ఈ బ్యూటీ. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఇటీవలే ఓ సినిమా స్టార్ట్ అయ్యింది. మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్నాడు. త్వరలో షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్తను ఫిక్స్ చేశారట. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. 

ఇక బెల్లంకొండా సాయి శ్రీనివాస్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ హీరో దర్శకుడు సాగర్ కె చంద్రతో టైసన్ నాయుడు అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.