చైనాలో మరో వైరస్: చీము, నెత్తురు ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి

చైనాలో మరో వైరస్: చీము, నెత్తురు ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి

ఇప్పటికే 60 మందికి వైరస్.. ఏడుగురు మృతి
పాత ఫెల్బోవైరస్ కు చెందిన కొత్త స్ట్రెయిన్ అంటుున్న సైంటిస్టులు
తొలిదశలో గుర్తిస్తే కంట్రోల్ అయితదంటున్న సైంటిస్టులు

బీజింగ్: చైనాలో మరో వైరస్ వ్యాపిస్తోంది. పశువుల గోమారి నుంచి ఇది మనుషులకు సోకుతోంది. ఈస్ట్ చైనాలోని జైంగ్సూ ప్రావిన్స్ లో 37 మందికి, అన్హుయీ ప్రావిన్స్ లో 23 మందికి ఈ వైరస్ అంటుకోగా.. ఇప్పటికే ఏడుగురు చనిపోయారట. అయితే.. ఇది ప్రస్తుత కరోనా వైరస్ మాదిరిగా కొత్తది కాదని, బన్యావైరస్ కేటగిరీలోకి వచ్చే ఫెల్బో వైరస్ కు చెందిన కొత్త స్ట్రెయిన్ (రకం) మాత్రమే అని సైంటిస్టులు చెప్తున్నారు. పశువుల శరీరానికి పట్టుకుని, రక్తాన్నిపీల్చుకునే నల్లి వంటి ఏసియన్ టిక్ ( దీనినే గోమారి, పిడుజు లేదా పిడుదు అంటారు) ద్వారా ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తుందని చెప్తున్నారు. ఈ వైరస్ వల్ల‘సివియర్ ఫీవర్ విత్ త్రాంబోసైటోపీనియా సిండ్రోమ్ (ఎస్ఎఫ్ టీఎస్)’ వ్యాధి వస్తుందని, అందుకే దీనిని ఎస్ఎఫ్ టీఎస్ వైరస్ అని పిలుస్తున్నట్లు సైంటిస్టులు వెల్లడించారు. అడవులకు దగ్గరగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోఎక్కువగా ఇది వ్యాపిస్తుందని అంటున్నారు. ఈ వైరస్ సోకిన గోమారి మనుషులను కుట్టినప్పుడు వారికి వైరస్ వ్యాపిస్తోందని, వైరస్ సోకిన మనుషుల రక్తం లేదా మ్యూకస్ (చీము, చీమిడి, శ్లేష్మం వంటివి) ద్వారా ఇతరులకు అంటుతోందని సైంటిస్టులు చెప్తున్నారు.

2009లోనే మొదటి కేసు..

ఎస్ఎఫ్ టీఎస్ వ్యాధిని మొదటిసారిగా చైనాలో 2009లో గుర్తించారు. ఈ వ్యాధి బారిన పడిన పేషెంట్లలో ఫెల్బోవైరస్ ను 2011లో కనుగొన్నారు. నాన్ జింగ్ కు చెందిన ఓ మహిళకు ఎస్ఎఫ్ టీఎస్ డిసీజ్ రావడంతో.. యాంటీ వైరల్ ట్రీట్ మెంట్ చేశారని, నెల తర్వాత ఆమెను డిశ్చార్జ్చేశారని చైనీస్ మీడియా పేర్కొంది. అలాగే మూడేళ్ల క్రితం ఓ వ్యక్తి ఈ వ్యాధితో చనిపోగా, అంత్యక్రియలకు హాజరైనోళ్ల‌లో 16 మందికి ఇది అంటుకుందని వెల్లడించింది. ఇప్పటివరకు ఉన్న డేటా ప్రకారం.. ఎస్ఎఫ్ టీఎస్ డిసీజ్ మార్చి నుంచి నవంబర్ వరకు రూరల్ ఏరియాల్లో ఎక్కువగా వస్తోంది. ఏప్రిల్ నుంచి జులై మధ్యనే ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తోంది. గతంలోనూ చైనా, సౌత్ కొరియా, జపాన్, వియత్నాం, తైవాన్ దేశాల్లో ఈ వ్యాధి
వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి.

తొలిదశలో గుర్తిస్తే కంట్రోల్ చేయొచ్చు..

ఎస్ఎఫ్ టీఎస్ పేషెంట్లలో డెత్ రేట్ 1 నుంచి 5 శాతం ఉంటుందని, ముఖ్యంగా వయసు పైబడినవాళ్ల‌కు రిస్క్ ఎక్కువని చెప్తున్నారు. దీనికి కూడా వ్యాక్సిన్ కానీ, ప్రత్యేకమైన మందులు కానీ లేవని..వీలైనంత త్వరగా వైరస్ ను కంట్రోల్ చేసేందుకు
ట్రీట్ మెంట్ చేస్తే ఫలితం ఉంటుందన్నా రు. వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నోళ్ల‌కు ఆటోమేటిక్ గా తగ్గిపోగ్గితుందని, వ్యాధి తీవ్రమైనోళకు ్ల మాత్రం పలు అవయవాలు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుందని పేర్కొంటున్నారు.

సింప్టమ్స్ ఇవే..
ఈ వైరస్ బారిన పడినవారికి తొలిదశలో జ్వరం, అలసట, చర్మంపై దద్దుర్లు , దగ్గు , తలనొప్పి, అలసట వస్తాయి. తర్వాత వ్యాధి తీవ్రమైతే ఫీవర్, ప్లేట్ లెట్లు , తెల్ల రక్తకణాల సంఖ్య తగ్గడం, కడుపు, పేగు సమస్యల వంటి సింప్టమ్స్ కన్పిస్తాయి. కొంతమందిలో కండరాలు, నాడీ సమస్యలు, రక్తం ఎక్కువగా కారడం లేదా ఎక్కువగా గడ్డకట్టడం వంటి సింప్టమ్స్ కూడా ఉంటాయని అంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..