రాష్ట్రానికి రెయిన్ అలర్ట్

రాష్ట్రానికి రెయిన్ అలర్ట్

రాష్ట్రానికి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. బుధవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో తూర్పు నుంచి గాలులు బలంగా వీస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు భారీ వర్షాల అలర్ట్‎తో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రైతులు వడ్లను కల్లాల్లో ఆరబోశారు. అటు ఐకేపీ సెంటర్లలోనూ వడ్లు ఎండబోసి ఎప్పుడు కొంటారా అని ఎదురుచూస్తున్నారు. అయితే వర్షం పడితే కల్లాల్లో ఆరబోసిన ధాన్యం పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు.