- ఏపీ కేబినెట్ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: తిరుమల శ్రీవారి లడ్డూప్రసాదం నెయ్యిలో రసాయనాల మిశ్రమంపై కమిటీ ఏర్పాటు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సిట్ ఇచ్చిన నివేదికలోని లోపాలను సరిచేసి, అసలు సూత్రధారులను కనుగొనేందుకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్‌కు రిపోర్ట్ అప్పగించనున్నారు. కెమికల్స్ మిశ్రమం కలిసిన లడ్డూలను అయోధ్యకు కూడా పంపారని కేబినెట్‌లో అధికారులు పేర్కొన్నారు.
నెయ్యి టెండర్ నిబంధనలను మార్చడంపైనా మంత్రివర్గంలో చర్చించారు. ఫేక్ డాక్యుమెంట్లతో టెండర్ దక్కించుకున్నారని, టెండర్ నిబంధనలను మార్చినప్పటికీ ఈఓగా ఉన్న సింఘాల్ అభ్యంతరం వ్యక్తం చేయలేదని సీఎం దృష్టికి మంత్రులు తీసుకెళ్లారు. లోపాలను సరిచేసి అసలు విషయాలు బహిర్గతం చేసేందుకే సిట్ నివేదికను కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్‌కు అప్పగించామని సీఎం చంద్రబాబు తెలిపారు.
