కృష్ణా డెల్టాకు196 టీఎంసీలు కావాలి..తెలంగాణ లెక్కలు తప్పని ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదనలు

కృష్ణా డెల్టాకు196 టీఎంసీలు కావాలి..తెలంగాణ లెక్కలు తప్పని ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదనలు

హైదరాబాద్, వెలుగు: కృష్ణా డెల్టా కోసం ఏపీకి196 టీఎంసీల జలాలు అవసరమని, తెలంగాణ చెప్పిన 130 టీఎంసీల లెక్క తప్పని ఏపీ పేర్కొంది. సోమవారం బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌లో ఏపీ తన వాదనలు వినిపించింది. వరి పంట140 రోజులు ఉంటుందని.. తెలంగాణ చెప్పినట్టు 122 రోజులు నీళ్లు ఇస్తే చాలదని తెలిపింది. తక్కువ సమయం పరిగణనలోకి తీసుకుంటే పంట నాణ్యత తక్కువగా ఉంటుందని వాదించింది. తక్కువ నాణ్యత కలిగిన వెరైటీలను పండిస్తే నష్టం తప్పదని పేర్కొంది.