వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్1 ప్రారంభం..జాతికి అంకితం చేసి ఏపీ సీఎం చంద్రబాబు

వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్1 ప్రారంభం..జాతికి అంకితం చేసి ఏపీ సీఎం చంద్రబాబు

మార్కాపురం: ఏపీలోని మార్కాపురం జిల్లాలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫస్ట్ పేజ్‌‌ను ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద నల్లమల కొండల్లోని జంట సొరంగాల నుంచి వెలువడిన కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, జల హారతి ఇచ్చి స్వాగతించారు. ప్రాజెక్టు తొలిదశ ప్రారంభోత్సవానికి సూచికగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కృష్ణా జలాలకు సీఎం సాష్టాంగ నమస్కారం చేశారు.

 శ్రీశైలం జలాశయంలోని కొల్లం వాగు నుంచి గ్రావిటీ ద్వారా తరలించిన కృష్ణా జలాలు వెలిగొండ జంట సొరంగాల మీదుగా గంటవానిపల్లె ఆక్విడెక్టుకు చేరుకుని నల్లమల సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు పరుగులు తీశాయి. అక్విడెక్టు వద్ద రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్విచ్ నొక్కి జలాలను దిగువకు వదిలారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం తన జీవితంలో భావోద్వేగ సందర్భమని చంద్రబాబు పేర్కొన్నారు. 1996 మార్చి 5న సీఎంగా తానే ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేశానని, సరిగ్గా 30 ఏండ్ల తర్వాత 2026 ఆగస్టు 31న ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్‌‌ను  ప్రారంభించానని చెప్పారు.