బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు

బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు
  •     ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి  ఆరోగ్య పరిస్థితిపై ఆరా

హైదరాబాద్, వెలుగు: సినిమా షూటింగ్‌‌‌‌‌‌‌‌లో గాయపడి చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం పరామర్శించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. బాలయ్య ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఎండీ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చికిత్స వివరాలను చంద్రబాబుకు వివరించారు. 

ఈ నెల 21న కాకినాడ పోర్టులో సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ గాయపడ్డారు. ఎడమ మోకాలి చుట్టూ కణజాలాల్లో రక్తం చేరి వాపు రావడంతో ఏఐజీ వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.