దాదాపు ఐదు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జీవితం ఇప్పుడు సినిమాగా రాబోతోంది. గతంలోనూ కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లలో ఆయన ప్రస్తావన ఉన్నప్పటికీ పూర్తిస్థాయి బయోపిక్ మాత్రం రాలేదు. ‘రాజధాని ఫైల్స్’ చిత్రంతో అమరావతి రైతుల త్యాగాన్ని తెరకెక్కించిన దర్శకుడు భాను ఇప్పుడీ బయోపిక్‌కు ప్లాన్ చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు జీవితంలోని ముఖ్య సంఘటనలే ప్రధాన కథాంశంగా ఈ సినిమా ఉండబోతోంది. చంద్రబాబు జీవితంలో జరిగిన ప్రతీ సంఘటనలో ఒక ఉద్వేగం, సంఘర్షణ ఉందని వాటన్నింటి సమాహారమే ఈ బయోపిక్ అని భాను చెప్పారు. అందుకే దీన్ని పాన్ వరల్డ్ మూవీగా ప్రపంచ భాషల్లో తీస్తామని ఆయన తెలిపారు.

