V6 News

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల.. అమ్మాయిలదే హవా...

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల.. అమ్మాయిలదే హవా...

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆన్ లైన్ లో ఫలితాలు విడుదల చేశారు మంత్రి నారా లోకేష్.2025-26 అకడమిక్ ఇయర్ కి సంబంధించి 10లక్షల 50 వేల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవ్వగా.. ఫస్ట్ ఇయర్ లో 77 శాతం మంది, సెకండ్ ఇయర్ లో 81 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు మంత్రి లోకేష్. ఇక ఒకేషనల్ కోర్సులో ఫస్ట్ ఇయర్ లో 61 శాతం మంది, సెకండ్ ఇయర్ లో 74 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు.

ఇంటర్ ఫలితాల్లో ఈ ఏడాది కూడా అమ్మాయిలదే పై చేయి సాధించారు. ఫస్ట్ ఇయర్ లో 72 శాతం మంది అబ్బాయిలు పాస్ అవ్వగా.. 81 శాతం మంది అమ్మాయిలు పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ లో 76 శాతం మంది అబ్బాయిలు పాస్ అవ్వగా... 85 శాతం మంది అమ్మాయిలు పాస్ అయ్యారు.

విద్యార్థులు https://resultsbie.ap.gov.in వెబ్ సైట్ లో ఇంటర్ ఫలితాలు పొందవచ్చు. అంతే కాకుండా వాట్సప్ లో 9552300009 నంబర్ కు Hi అని మెసేజ్ చేసి, హాల్ టికెట్ నంబర్ ను పంపితే ఫలితాలు నేరుగా వాట్సప్ కే వస్తాయని తెలిపారు మంత్రి నారా లోకేష్. 

మే 21 నుంచి జూన్ 4 వరకు సప్లిమెంటరీ పరీక్షలు, జూన్ 7 నుంచి 11 ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి 27 వరకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం అప్లై చేసుకోవచ్చని తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఏ మాత్రం అధైర్యపడవద్దని...మరింత పట్టుదలతో శ్రమించి సప్లిమెంటరీ పరీక్షలో పాస్ అవ్వాలని సూచించారు మంత్రి లోకేష్.