విజయవాడలో రోడ్డెక్కిన సిటీ బస్సులు

విజయవాడలో రోడ్డెక్కిన సిటీ బస్సులు

విజయవాడ: నగరంలో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఇవాళ ఉదయం నుండి సిటీ సర్వీసులు నడుపుతున్నారు. గత మార్చిలో లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత డిపోలు.. గ్యారేజీలకే పరిమితమైపోయిన సిటీ బస్సులు.. ఎట్టకేలకు రోడ్డుపైకి వచ్చాయి. తొలి విడుతగా 200 బస్సు సర్వీసులను నడుపుతున్నారు. 60 శాతం ప్రయాణికులతో సిటీ బస్సులు నడుస్తాయి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. ఒక సీటులో ఒకరికే అనుమతిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇవాళ మంగళగిరి ,విద్యా ధరపురం మైలవరం,ఆగిరిపల్లి తో పాటు మొత్తం ఆరు ప్రధాన రూట్లలో బస్సులు నడుస్తున్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు బస్సులు తిరుగుతాయి. ఈనెల 20 నుంచి 26 వరకు గ్రామ సచివాలయ ఉద్యోగాలకు రాత పరీక్షలు జరగనున్న నేపధ్యంలో అభ్యర్థుల కోసం అదనపు బస్సులు నడిపే యోచన చేస్తున్నారు. గత ఆరు నెలలుగా సిటీ సర్వీసులు నడవకపోవడంతో సిటీ జనం చాలా ఇబ్బందిపడుతున్నారు. మినిమం చార్జీ రూ.5 తో నడిచే సిటీ సర్వీసులు మళ్లీ ప్రారంభం కావడంతో సామాన్యులకు రవాణా కష్టాల నుండి ఊరట లభించినట్లయింది.